Bible, ప్రకటన గ్రంథము, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11168&pid=68&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ప్రకటన గ్రంథము

Bible - Telugu Bible OV, 1880

యూదా ప్రకటన గ్రంథము

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

1 యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

2 అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.

3 "సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు."

4 "యోహాను ఆసియలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది- వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాని నుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు,"

5 "నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగును గాక."

6 "మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను."

7 "ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచుచు, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును, ఆమేన్."

8 "అల్పాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిషత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు."

9 "మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవానములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని."

10 ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూర ధ్వని వంటి గొప్పస్వరము -

11 "నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్పియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని."

12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

13 "తిరుగగా ఏడు సువర్ణ ద్వీపస్తంభములను, ఆ ద్వీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను."

14 ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవలె ఉండెను.

15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను.

16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటి నుండి రెండంచులు గల వాడియైన ఖడ్గమొకటి బయలు వెలుచుండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.

17 నేనాయనను చూడగానే చచ్చిన వానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;

18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

ప్రకటన గ్రంథము 1:18 - The Revelation to John
The Revelation to John
19 "కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవు వాటిని,"

20 "అనగా నా కుడిచేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును , ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు."

<< Prev Top Next → >>