Bible, 1 యోహాను, అధ్యాయం 5. is available here: https://www.bible.promo/chapters.php?id=11164&pid=64&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 యోహాను

Bible - Telugu Bible OV, 1880

2 పేతురు 1 యోహాను 2 యోహాను

అధ్యాయం 1 2 3 4 5

1 యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.

2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదము.

3 మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.

4 దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.

5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?

6 "నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే, ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే."

7 "సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును."

8 ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.

9 మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే.

10 దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.

11 "ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది."

12 "దేవుని కుమారుని అంగీకరించు వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే."

13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.

14 "ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తాను సారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే."

15 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన యెడల మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.

16 తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును; ఆతని బట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు.

17 "సకల దుర్ణీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు."

18 దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

19 "మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము."

20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

21 "చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి."

<< ← Prev Top Next >>