Bible, 2 పేతురు, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11157&pid=63&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 2 పేతురు

Bible - Telugu Bible OV, 1880

1 పేతురు 2 పేతురు 1 యోహాను

అధ్యాయం 1 2 3

1 "యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది."

2 "తన మహిమనుబట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,"

3 దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

4 "ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను."

5 "ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,"

6 "జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము నందు సహనమును, సహనమునందు భక్తిని,"

7 "భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి."

8 ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.

9 "ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేని వాడునగును."

10 "అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి."

11 మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.

12 "కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి యున్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. పేతురు తన మరణము గూర్చి చెప్పుట"

13 "మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని యెరిగి,"

14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను.

15 నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసి కొనునట్లు జాగ్రత్తచేతును.

16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కధలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని

17 "ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. '' ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను'' అను శబ్దము మహాదివ్యమహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా,"

18 "మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి."

19 మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

20 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని యిచ్ఛను బట్టి పుట్టలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.

<< Prev Top Next → >>