Bible, హెబ్రీయులకు, అధ్యాయం 7. is available here: https://www.bible.promo/chapters.php?id=11140&pid=60&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 "మెల్కీసెదెకు వంటి ప్రధానయాజకుడైన క్రీస్తు రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదియవ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు."

2 "అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్ధము. అతడు తండ్రిలేని వాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు."

3 ఇత డెంత ఘనుడో చూడండి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్నశ్రేష్టమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.

4 "మరియు లేవి కుమాళ్లలో నుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసము నుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని,"

5 వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహాము నొద్ద పదియవ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.

6 తక్కువ వాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాటకేవలము నిరాక్షేపమైయున్నది.

7 "మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొను చున్నాడు."

8 అంతేకాక ఒక విధమున చెప్పినయెడల పదియవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను.

9 ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

10 "ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవరసమేమి?"

11 ఇదియు గాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును.

12 ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు.

13 "మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమియు చెప్పలేదు,"

14 "మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవము కున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు."

15 కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.

16 ఏలయనగా - నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.

17 ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమై నందునను అది నివారణ చేయబడియున్నది; అంతకంటె శ్రేష్టమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను.

18 దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము.

19 మరియు ప్రమాణము లేకుండు యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని ఈయన-

20 నీవు నిరంతరము యాజకుడవైయున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు

21 "అని ఈయనతో చెప్పిన వానివలన ప్రమాణ పూర్వకముగా యాజకుడాయెను,"

22 "మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని"

23 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.

24 "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు."

25 "పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటె మిక్కిలి హెచ్చయినవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు."

26 ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను.

27 "గనుక, ఈయన ఆ ప్రధాన యాజకులవలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు;"

28 తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను.

<< ← Prev Top Next → >>