Bible, హెబ్రీయులకు, అధ్యాయం 3. is available here: https://www.bible.promo/chapters.php?id=11136&pid=60&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / హెబ్రీయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలేమోనుకు హెబ్రీయులకు యాకోబు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

1 "ఇందువలన, పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి."

2 "దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను."

3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.

4 "ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను."

5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6 "అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటి మీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన యిల్లు."

7 మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు-

8 "నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి."

9 నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.

10 "కావున నేను ఆ తరము వారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పి పోవుచున్నారు- నా మార్గములను తెలిసికొనలేదు,"

11 గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.

12 "సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి."

13 "నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించిన నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక,"

14 "పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు - నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి."

15 ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢవిశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.

16 విని కోపము పుట్టించిన వారెవరు ? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా?

17 ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను ? పాపము చేసినవారి మీదనే గదా ? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.

18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను ? అవిధేయులైన వారిని గూర్చియే గదా?

19 కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.

<< ← Prev Top Next → >>