Bible, 1 తిమోతికి, అధ్యాయం 6. is available here: https://www.bible.promo/chapters.php?id=11125&pid=56&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 తిమోతికి

Bible - Telugu Bible OV, 1880

2 థెస్సలొనీకయులకు 1 తిమోతికి 2 తిమోతికి

అధ్యాయం 1 2 3 4 5 6

1 "దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండనట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్న వారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను."

2 విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి ఎక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.

3 "ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన యెడల,"

4 వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును

5 చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ్ధ వివాదములును కలుగుచున్నవి.

6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైయున్నది.

7 "మనమీ లోకములోని కేమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసుకొని పోలేము."

8 "కాగా, అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొంది యుందము."

9 "ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచి వేయును."

10 "ఎందుకనగా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి."

11 "దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము."

12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

13 సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యెదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు యెదుటను

14 "మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగునంత వరకును నీవు నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను."

15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.

16 "సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అమరత్వము గలవాడై యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక, ఆమేన్."

17 "ఇహమందు ధనవంతులైన వారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము."

18 "వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలు చేయువారును,"

19 "సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము."

20 ". ఓ తిమోతీ, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము."

21 . ఆ విషయములో ప్రవీణులమని కొందరునుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండును గాక.

<< ← Prev Top Next >>