1 "తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును,"
2 "మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును, మా కొరకు ప్రార్ధించుడి; విశ్వాసము అందరికి లేదు."
3 అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును.
4 "మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువు నందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము."
5 దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
6 "సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము."
7 ఏలాగు మమ్మును పోలి నడచు కొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడచుకొనలేదు.
8 ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి.
9 "మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనబరచుకొనుట కొరకే ఈలాగు చేసితిమి గాని, మాకు అధికారము లేదని చేయలేదు."
10 మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లనియెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా?
11 "మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు, అక్రమముగా నడచుకొనుచున్నారని వినుచున్నాము."
12 అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొన్న ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
13 "సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుక వద్దు."
14 ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడనియెడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
15 అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి.
16 సమాధాన కర్తయగు ప్రభువు తానే ఎల్లపుడును ప్రతివిధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక.ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
17 "పౌలను నేను నాచేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికలో అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే."
18 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికి తోడైయుండును గాక. |