Bible, కొలస్సయులకు, అధ్యాయం 2. is available here: https://www.bible.promo/chapters.php?id=11109&pid=53&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / కొలస్సయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలిప్పీయులకు కొలస్సయులకు 1 థెస్సలొనీకయులకు

అధ్యాయం 1 2 3 4

1 "మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడనివారందరికొరకును"

2 "నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను."

3 బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

4 ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.

5 "నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను."

6 "కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,"

7 "మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి."

8 "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకతత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి."

9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

10 మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్ష్సె యున్నాడు;

11 "మీరును క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి."

12 మీరు బాప్తిస్మ మందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.

13 "మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుట వలనను మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి,"

14 "దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ, దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;"

15 "ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను."

16 "కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి."

17 ఇవి రాబోవువాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.

18 "అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్ఛ కలిగి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సువలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి."

19 "ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది."

20 మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి

21 "చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల?"

22 అవన్నియు వాడుకొనుట చేత నశించిపోవును.

23 "అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు."

<< ← Prev Top Next → >>