Bible, కొలస్సయులకు, అధ్యాయం 1. is available here: https://www.bible.promo/chapters.php?id=11108&pid=53&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / కొలస్సయులకు

Bible - Telugu Bible OV, 1880

ఫిలిప్పీయులకు కొలస్సయులకు 1 థెస్సలొనీకయులకు

అధ్యాయం 1 2 3 4

1 "కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది."

2 మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3 "పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని,"

4 "ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము."

5 మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

6 "ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది."

7 ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.

8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.

9 "అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును,"

10 "ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు,"

11 "ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,"

12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

13 "ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్య నివాసులనుగా చేసెను."

14 "ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది."

15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.

16 "ఏలయనగా, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింప బడెను."

17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు.

18 "సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతు డయెను."

19 "ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక మందున్నవైనను పరలోకమందున్నవైనను,"

20 వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధాన పరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

21 "మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మునుకూడ"

22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను.

23 "పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని."

24 "ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పినపాట్లలో కొదువైన వాటియందు నావంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను."

25 "దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము,"

26 నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.

27 "అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను."

28 "ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువ బెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము."

29 "అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను."

<< Prev Top Next → >>