Bible, ఎఫెసీయులకు, అధ్యాయం 2. is available here: https://www.bible.promo/chapters.php?id=11099&pid=51&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / ఎఫెసీయులకు

Bible - Telugu Bible OV, 1880

గలతీయులకు ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6

1 "మీ అపరాధములచేతను పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను."

2 "మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి."

3 "వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి."

4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను.

5 కృప చేత మీరు రక్షింపబడియున్నారు.

6 "క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము,"

7 "క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను."

8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి యున్నారు; ఇది మీవలన కలిగినది కాదు. దేవుని వరమే.

9 "అది క్రియలవలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడవీలు లేదు."

10 "మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింప బడిన వారమై ఆయన చేసిన పనియైయున్నాము."

11 "కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై యుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేని వారనబడిన మీరు"

12 "ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలేని పరజనులును, నిరీక్షణలేని వారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి."

13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తురక్తము వలన సమీపస్థులై యున్నారు.

14 "ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను."

15 "ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,"

16 "తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు."

17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేర గలిగియున్నాము.

19 "కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు."

20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.

21 "ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది."

22 ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

<< ← Prev Top Next → >>