1 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
2 "నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్థిల్లిన కొలది, తనయొద్ద కొంత సొమ్ము నిలువ జేయవలెను."
3 "నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో, వారి చేత మీ ఉపకారద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును."
4 నేను కూడ వెళ్ళుట యుక్తమైన యెడల వారు నాతో కూడ వత్తురు.
5 అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్ళ నుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీయొద్దకు వచ్చెదను.
6 "అప్పుడు మీ యొద్ద కొంత కాలము ఆగవచ్చును, ఒకవేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును."
7 "ప్రభువు సెలవైతే మీయొద్ద కొంత కాలముండ నిరీక్షించుచున్నాను గనుక,"
8 "ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు,"
9 "కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి యున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక, పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును."
10 తిమోతి వచ్చిన యెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి. నావలెనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు.
11 . గనుక ఎవడైనను అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడ వచ్చునని ఎదురుచూచుచున్నాను.
12 "సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతియేమనగా, అతడు సహోదరులతో కూడ మీ యొద్దకు వెళ్ళవలెనని నేనతనిని చాల బతిమాలుకొంటిని గాని, ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు, వీలైనప్పుడు అతడు వచ్చును."
13 "మెలకువగా నుండుడి. విశ్వాసమందు నిలకడగా నుండుడి. పౌరుషము గలవారై యుండుడి, బలవంతులై యుండుడి."
14 మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
15 "స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును."
16 "కాబట్టి సహోదరులారా, అట్టివారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు నుండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొను చున్నాను."
17 "స్తెఫను, ఫొర్మూనాతు అకాయికు అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను."
18 మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి.
19 ఆసియలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు.
20 "అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి ఇంటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి."
21 పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను.
22 ఎవడైను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక; ప్రభువు వచ్చుచున్నాడు.
23 ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
24 క్రీస్తుయేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. |