Bible, 1 కొరింథీయులకు, అధ్యాయం 12. is available here: https://www.bible.promo/chapters.php?id=11074&pid=48&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / 1 కొరింథీయులకు

Bible - Telugu Bible OV, 1880

రోమీయులకు 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నా కిష్టము లేదు."

2 మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

3 "ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను."

4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే.

5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6 "నానావిధములైన కార్యములు కలవు గాని, అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే."

7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8 "ఎలాగనగా- ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును,"

9 "మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును,"

10 "మరియొకనికి అద్భుతకార్యములు చేయుశక్తియు, మరియొకనికి ప్రవచనవరమును, మరియొకనికి ఆత్మలవివేచనయు, మరియొకనికి నానావిధభాషలును మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి."

11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

12 "ఏలాగు శరీరము ఏకమైయున్నాను అనేక అవయవములు కలిగియున్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నియు అనేకములై యున్నను, ఒక్క శరీరమై యున్నవో ఆలాగే క్రీస్తు ఉన్నాడు."

13 "ఏలాగనగా- యూదులమైనను, గ్రీసు దేశస్తులమైనను, దాసులమైనను, స్వతంతులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి."

14 శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15 నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16 మరియు నేను కన్ను గాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17 శరీర మంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడా?

18 అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను.

19 "అవన్నియు ఒక్క అవయవమైతే శరీర మెక్కడా? అవయవములు అనేకములైనను శరీరమొక్కటే,"

20 గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు.

21 తల పాదములతో మీరు నాకక్కర లేదని చెప్పజాలదు.

22 అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యకములే.

23 శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన పౌందర్యము కలుగును.

24 సుందరములైన మన అవయవములకు ఎక్కువ పౌందర్య మక్కరలేదు.

25 అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదాని నొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు.

26 కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

27 అటువలె మీరు క్రీస్తు యొక్క శరీరమై యుండి వేర్వేరుగా అవయవములై యున్నారు.

28 "మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానాభాషలు మాటలాడు వారినిగాను నియమించెను."

29 అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు కలవారా? అందరు భాషలతో మాటలాడుచున్నారా ?

30 అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియును గాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

<< ← Prev Top Next → >>