Bible, రోమీయులకు, అధ్యాయం 15. is available here: https://www.bible.promo/chapters.php?id=11061&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచు కొనక, బలహీనుల దౌర్భల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము."

2 తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోష పరచవలెను.

3 క్రీస్తు కూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని - నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి యున్నట్లు ఆయనకు సంభవించెను.

4 "ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి."

5 "మీరేక భావము గలవారై, ఏకగ్రీవముగా మనప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము,"

6 క్రీస్తుయేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకునుకర్తయగు దేవుడు మీ కనుగ్రహించును గాక.

7 కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి.

8 "నేను చెప్పునదేమనగా - పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను."

9 అందువిషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.

10 "మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు,"

11 "మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది."

12 "మరియు యెషయా ఈలాగు చెప్పుచున్నాడు - యెష్షయిలో నుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణయుంచుదురు."

13 "కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిపొంది, విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను, సమాధానముతోను మిమ్మును నింపును గాక మోమాటము లేక వ్రాసినందుకు పౌలు క్షమాపణ"

14 "నా సహోదరులారా, మీరు కేవలము మంచి వారును సమస్త జ్ఞాన సంపూర్ణులును, ఒకరికి మరియొకరు బుద్ధి చెప్ప సమర్థులునై యున్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను."

15 "అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధ పరచబడి, ప్రీతికరమగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు,"

16 "దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి, అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను."

17 "కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో, నాకు అతిశయ కారణము కలదు."

18 "ఏలాగనగా- అన్యజనులు విధేయులగునట్లు, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నాద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని, మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను."

19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశము లందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి యున్నాను.

20 "నేనైతే మరియొకని పునాది మీద కట్టకుండు నిమిత్తము,"

21 "ఆయనను గూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము, క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని."

22 ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.

23 "ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక,"

24 "అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావలెనని మిక్కిలి అపేక్ష కలిగి, నేను స్పెయిను దేశమునకు వెళ్ళునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది, మీ చేత అక్కడికి సాగనంప బడుదునని నిరీక్షించుచున్నాను."

25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను.

26 "ఏలయనగా, యెరూషలేములో నున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును, అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి."

27 "అవును, వారిష్టపడి దానిని చేసిరి, వారు వీరికి ఋణస్థులు. ఎట్లనగా, అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారైయున్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్ధులై యున్నారు."

28 ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.

29 "నేను మీ యొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును."

30 "సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి, యెరూషలేములో చేయవలసియున్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,"

31 "నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,"

32 "మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను."

33 "సమాధాన కర్తయగు దేవుడు మీ కందరికి తోడై యుండునుగాక, ఆమేన్."

<< ← Prev Top Next → >>