Bible, రోమీయులకు, అధ్యాయం 13. is available here: https://www.bible.promo/chapters.php?id=11059&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 ప్రతివాడునుపై అధికారులకు లోబడి యుండవలెను.; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడియున్నవి.

2 కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదురించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

3 ప్రభుత్వము చేయువారు చెడ్ఢ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు.;

4 "నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పుపొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు."

5 కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

6 ఏలయనగా వారు దేవుని సేవకులై యుండి ఎల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

7 "ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని యెడల భయముండవలెనో వాని యెడల భయమును ఎవని యెడల సన్మానముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి."

8 ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి యుండవద్దు. పొరుగువానిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9 "ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైనను ఉన్న యెడల అదియు, నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి యున్నవి."

10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

11 "మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలు కొను వేళయైనదని తెలిసికొని ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది."

12 "రాత్రి చాల గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము."

13 "అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడచుకొనునట్టు మర్యాదగా నడచుకొందము."

14 "మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి."

<< ← Prev Top Next → >>