1 "సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై నున్నవి."
2 వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
3 "ఏలయనగా, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు,"
4 "విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు. అందరి కొరకైన క్రొత్త నీతి మార్గము"
5 "ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు, దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు."
6 అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది
7 "ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును? అనగా, క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక - ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు."
8 "అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే."
9 "అదేమనగా - యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు."
10 "ఏలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును."
11 "ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది."
12 "యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి తనకు ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు."
13 ఎందుకనగా - ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.
14 వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు?
15 ప్రకటించు వారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై - ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది.
16 "అయినను అందరు సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను? అని యెషయా చెప్పుచున్నాడు గదా?"
17 కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును.
18 "అయినను నేను చెప్పునదేమనగా - వారు వినలేదా ? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను."
19 "మరియు నేను చెప్పునదేమనగా - ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను. అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును, అని మొదట మోషే చెప్పుచున్నాడు."
20 మరియు యెషయా తెగించి - నన్ను వెదకని వారికి నేను దొరికితిని; నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు.
21 "ఇశ్రాయేలు విషయమైతే, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు." |