Bible, రోమీయులకు, అధ్యాయం 8. is available here: https://www.bible.promo/chapters.php?id=11054&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసు నందున్నవారికి ఏ శిక్షావిధియును లేదు.

2 "క్రీస్తుయేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయెనో దానిని దేవుడు చేసెను."

3 "శరీరము ననుసరింపక ఆత్మ నను సరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబధమైన నీతివిధి నెరవేర్చ బడవలెనని పాప పరిహారము నిమిత్తము,"

4 "దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను."

5 "శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము;"

6 "ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునైయున్నది."

7 "ఏలయనగా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు."

8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు.

9 దేవుని ఆత్మ మీలో నివసించి యున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడయన వాడు కాడు.

10 "క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది."

11 "మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తుయేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును."

12 "కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము."

13 "మీరు శరీరాను సారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు గాని, ఆత్మ చేత శారీరక క్రియలను చంపినయెడల జీవించెదరు."

14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింప బడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

15 "ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంద లేదు గాని, దత్త పుత్త్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా, తండ్రీ, అని మొర్ర పెట్టుచున్నాము."

16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

17 "మనము పిల్లలమైతే వారసులము అనగా, దేవుని వారసులము. క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పిన యెడల, క్రీస్తు తోడి వారసులము. ప్రత్యక్షము కాబోవు మహిమ"

18 మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను.

19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

20 "ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి,"

21 "దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్య్రము పొందుదునను నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక, దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థ పరచబడెను."

22 సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము.

23 "అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమఫలముల నొందిన మనము కూడ దత్త పుత్త్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము."

24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.

26 "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు."

27 "మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు."

28 "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము."

29 "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేష్టుగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను."

30 "మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను."

31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు? దేవుని ప్రేమ

32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?

33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు?

34 "నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్న వాడును, మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే."

35 "క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయై నను, కరవైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా?"

36 "ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా - నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము."

37 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

38 "మరణమైనను, జీవమైనను, దేవదూత లైనను, ప్రధానులైనను, ఉన్నవియైనను, రాబోవునవియైనను, అధికారులైనను యెత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,"

39 మన ప్రభువైన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.

<< ← Prev Top Next → >>