Bible, రోమీయులకు, అధ్యాయం 7. is available here: https://www.bible.promo/chapters.php?id=11053&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్ర మెరిగిన మీతో మాటలాడుచున్నాను."

2 "భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును."

3 "కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును."

4 "కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరరీము ద్వారా, ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి."

5 "ఏలయనగా, మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై, ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై యుండెను."

6 "ఇప్పుడైతే, దేనిచేత నిర్భంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదలపొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవచేయుచున్నాము."

7 "కాబట్టి ఏమందుము ? ధర్మశాస్త్రము పాపమాయెనా ? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని, పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశ అనగా ఏమిటో నాకు తెలియకపోవును."

8 "అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము."

9 "ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని."

10 అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనుపించెను.

11 "ఏలయనగా, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను."

12 "కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధ మైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునై యున్నది."

13 "ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకర మాయెను."

14 ధర్మశాస్త్రము ఆత్మ స్మబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను.

15 "ఏలయనగా, నేను చేయునది నేనెరుగను. నేను చేయ నిశ్చయించునది చేయక, ద్వేషించునదియే చేయుచున్నాను."

16 ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.

17 "కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమేగాని, నేను కాదు."

18 "నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు."

19 నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

20 నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

21 కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని

23 "వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములలో ఉన్న పాప నియములకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది."

24 "అయ్యో, నేనెంత దౌర్భాగుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?"

25 "మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతాజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవనియ మమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను."

<< ← Prev Top Next → >>