Bible, రోమీయులకు, అధ్యాయం 6. is available here: https://www.bible.promo/chapters.php?id=11052&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 ఆలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలియుందుమా?

2 అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము ?

3 "క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా ?"

4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడ పాతిపెట్టబడితిమి.

5 "మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము."

6 ఏమనగా మనమికను పాపములకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువ వేయబడెనని యెరుగుదుము

7 చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు.

8 "మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,"

9 "మరణమునకు ఇకమీదట ఆయన మీద ప్రభుత్వము లేదనియు యెరిగి, ఆయనతో కూడ జీవించెదమని నమ్ముచున్నాము."

10 "ఏలయనగా, ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కసారే చనిపోయెను గాని, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు."

11 "అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై, క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి."

12 "కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి."

13 మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.

14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు.

15 అట్లయిన యెడల కృపకేగాని ధర్మ శాస్త్రమునకు లోనైనవారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికిని కూడదు.

16 "లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకేగాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?"

17 "మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,"

18 "పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము."

19 "మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి."

20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతి విషయమై నిర్భంధము లేనివారై యుంటిరి.

21 అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే.

22 "అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము."

23 "ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము."

<< ← Prev Top Next → >>