Bible, రోమీయులకు, అధ్యాయం 4. is available here: https://www.bible.promo/chapters.php?id=11050&pid=47&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / రోమీయులకు

Bible - Telugu Bible OV, 1880

అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామున కేమీ దొరికెనని అందుము.

2 "అబ్రాహాము క్రియల మూలముగ నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని, అది దేవుని యెదుట కలుగదు."

3 "లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను."

4 పనిచేయువానికి జీతము ఋణమే గాని దానమని ఎంచబడదు.

5 "పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది."

6 ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.

7 "ఏలాగనగా- తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు;"

8 ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.

9 ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతియని ఎంచబడెనను చున్నాము కదా?

10 "మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి గలిగి యుండినప్పుడా? సున్నతి లేనప్పుడా ? సున్నతి గలిగి యుండినప్పుడు గాదు, సున్నతి లేనప్పుడే."

11 "మరియు సున్నతి లేనివారైనను నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి అరోపించుటకై అతడు సున్నతి పొందకమునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను."

12 "మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను."

13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసమువలననైన నీతి మూలముగానే కలిగెను.

14 "ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును."

15 "ఏలయనగా, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమములును లేకపోవును,"

16 "ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రము కలవారికి మాత్రము కాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడ దృఢము కావలెనని కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను."

17 "తాను విశ్వసించిన దేవుని యెదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట అతడు మనకందరికి తండ్రియై యున్నాడు. ఇందును గూర్చి - నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది."

18 నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19 "మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,"

20 "అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక,"

21 "దేవుని మహిమ పరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్ధుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము పొందెను."

22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

23 "అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని,"

24 మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయబడెను.

25 "ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను."

<< ← Prev Top Next → >>