Bible, అపొస్తలుల కార్యములు, అధ్యాయం 28. is available here: https://www.bible.promo/chapters.php?id=11046&pid=46&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / అపొస్తలుల కార్యములు

Bible - Telugu Bible OV, 1880

యోహాను సువార్త అపొస్తలుల కార్యములు రోమీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 పౌలు మెలెతేలో మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసి కొంటిమి.

2 అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారమింతంత కాదు. ఏలయనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.

3 అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను.

4 ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు - నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి.

5 "అయితే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, ఏ హానియు పొందలేదు."

6 వారతని శరీరము వాచునో లేక అతడు ఆకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని - ఇతడొక దేవత అని చెప్పుకొనసాగిరి.

7 పొప్లి అను నొకడు ఆ ద్వీపమునకు ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో అతిథ్యం మిచ్చెను.

8 "అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి, ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను."

9 ఇది చూచి ఆ ద్వీపములోనున్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థత నొందిరి.

10 "మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. రోమా ప్రయాణము"

11 "మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్వినీ చిహ్నము గల అలెక్సెంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలు దేరి,"

12 సురకుసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి.

13 "అక్కడ నుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి, ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి."

14 అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి.

15 "అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును, త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను."

16 మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.

17 "మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడివచ్చినప్పుడు, అతడు - సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనదేదియు చేయక పోయినను, యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించ బడితిని."

అపొస్తలుల కార్యములు 28:17 - Paul Arrives at Rome
Paul Arrives at Rome
18 "వీరు నన్ను విమర్శచేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని,"

19 యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు యెదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;

20 ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.

21 "అందుకు వారు, యూదయనుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు. మరియు ఎవరును చెప్పుకొనను లేదు."

22 అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము.; ఈ మతభేదమును గూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు. ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.

23 "అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు, ప్రవక్తలలో నుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు, వారిని ఒప్పించుచుండెను."

24 "అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మక పోయిరి."

25 వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒకమాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా -

26 మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము.

27 "''ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, మనస్సారా గ్రహించి, నావైపు తిరిగి నా వలన స్వస్థతపొంద కుండుటన్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని, కన్నులు మూసికొని యున్నారు'' అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే."

28 "కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నదని మీరు తెలిసికొందురు గాక,"

29 వారు దాని విందురు. అతడు సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలో తాము చాల తర్కించుకొని వెళ్లిపోయిరి.

30 "పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి, తన యొద్దకు వచ్చువారందరిని పౌలు సన్మానించి"

31 "ఏ ఆటంకము లేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను."

<< ← Prev Top Next >>