1 "పౌలు మహాసభ వారిని తేరి చూచి - సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని యెదుట నడచుకొనుచుంటినని చెప్పెను."
2 "అందుకు ప్రధాన యాజకుడైన అననీయ - అతని నోటి మీద కొట్టుని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపించగా,"
3 "పౌలు అతని చూచి - సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా? అనెను."
4 దగ్గర నిలిచియున్న వారు - నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా ? అని అడిగిరి.
5 "అందుకు పౌలు - సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు - నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడియున్నదనెను."
6 "వారిలో ఒక భాగము సద్దూకయ్యులును, మరియొక భాగము పరిసయ్యులై యున్నట్టు పౌలు గ్రహించి - సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను; మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను."
7 "అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున, ఆ సమూహము రెండు పక్షములాయెను."
8 "సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూత యైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని, పరిసయ్యుల రెండును కలవని ఒప్పుకొందురు."
9 అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగానున్న శాస్త్రులలో కొందరు లేచి- ఈ మనుష్యుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడి యుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగవులాడిరి.
10 కలహ మెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదు రేమోయని సహస్రాధిపతి భయపడి - మీరు వెళ్లి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.
11 "ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి - ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను."
12 "ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్న పానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి."
13 ఈ కుట్రలో చేరిన వారు నలువది మంది కంటె ఎక్కువ.
14 వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి - మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని యున్నాము.
15 కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొన బోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడి యున్నామని చెప్పిరి.
16 అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి యున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెల్పెను.
17 "అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి - ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను."
18 "శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతని తోడుకొని పోయి, - ఖైదీయైనన పౌలు నన్ను పిలిచి, నీతోఒక మాట చెప్పుకొనవలెనని యున్న ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను."
19 సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి - నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని ఒంటరిగా అడిగెను.
20 అందుకతడు - నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు.
21 వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువది మంది కంటె ఎక్కువమంది మనుష్యులు అతని కొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని యున్నారు; ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను.
22 అందుకు సహస్రాధిపతి - నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.
23 "తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి - కైసరయ వరకు వెళ్లుటకు ఇన్నూరుమంది సైనికులను డెబ్బది మంది గుఱ్ఱపు రౌతులను ఇన్నూరు మంది ఈటెల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి,"
24 పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.
25 మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను-
26 మహా ఘనత వహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు -
27 "యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతోవచ్చి అతనిని తప్పించితిని."
28 వారు అతనిని మీద మోపిన నేరమేమో తెలిసికొన గోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసుకొని వచ్చితిని.
29 "వారు తమ ధర్మశాస్త్రవాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచ లేదు."
30 "అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనైయున్నారని నాకు తెలియ వచ్చినందున, వెంటనే అతని నీ యొద్దకు పంపించితిని. నేరము మోపిన వారు కూడ అతని మీద చెప్పవలెనని యున్న సంగతి నీ యెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొనిపోయిరి."
31 మరునాడు వారతనితో కూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.
32 వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడ అతని యెదుట నిలబెట్టిరి.
33 "అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు - ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి, అతడు కిలికియ వాడని తెలిసికొని -"
34 "నీ మీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి,"
35 హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను. |