1 "వారు అంఫిపొలి, అపొల్లొనియ పట్టణముల మీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరమొకటి యుండెను."
2 "కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి,"
3 "క్రీస్తు శ్రమ పడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు వారితో మూడు వారములు అనగా మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను."
4 వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలమందియు ప్రముఖులును ఘనత గల స్త్రీలోలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
5 "అయితే యూదులు మత్సరపడి, పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు, యాసోను యింటి మీద పడి వారిని జనుల సభ యెదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి."
6 "అయితే వారు కనబడనందున యాసోనును, కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయి - భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు."
7 "వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడచు కొనువారు అని కేకలు వేసిరి."
8 "ఈ మాటలు వినుచున్న జనసమూహమును, పట్టణపు అధికారులను కలవరపరచిరి."
9 "వారు యాసోను నొద్దను, మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి."
10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.
11 "వీరు థెస్సలోనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి."
12 "అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమంది విశ్వసించిరి."
13 అయితే బెరలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
14 వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
15 "పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యయమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి."
16 "పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొనియుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్ట లేక పోయెను."
17 "కాబట్టి సమాజ మందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతి దినమున సంత వీధులలో తన్ను కలుసుకొను వారితో తర్కములాడుచుండెను."
18 "ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు, పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు - వీడు అన్యదేవతలను అనగా దయ్యములను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి."
19 అంతటవారు అతని వెంట బెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి - నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా?
20 కొన్ని క్రొత్త సంగతులు మా చెవికి వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
21 "ఏథెన్సు వారందరును, అక్కడ నివసించు పరదేశులును ఏదో యొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపడుచుండెడి వారు."
22 ". పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై యున్నట్లు నాకు కనబడుచున్నది."
23 "నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, ఒక బలిపీఠము నాకు కనబడెను. - దాని మీద- తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచుర పరచుచున్నాను."
24 "జగత్తును అందలి సమస్తమును, నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందువలన హస్తకృతములైన ఆలయములో నివసింపడు."
Paul in Athens 25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు.
26 "మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను."
27 ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు.
28 "మనమాయన యందు బ్రతుకు చున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు."
29 కాబట్టి మనము దేవుని సంతానమై యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.
30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా నుండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
31 "ఎందుకనగా, తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపి యుండినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి యున్నాడు."
32 "మృతుల పునరుత్థానము గురించి వారు వినినప్పుడు, కొందరు అపహస్యము చేసిరి, మరికొందరు - దీని గూర్చి నీవు చెప్పునది మరి ఇంకొకసారి విందుమని చెప్పిరి."
33 అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయెను.
34 "అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడ మరికొందరును యుండిరి." |