Bible, అపొస్తలుల కార్యములు, అధ్యాయం 9. is available here: https://www.bible.promo/chapters.php?id=11027&pid=46&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / అపొస్తలుల కార్యములు

Bible - Telugu Bible OV, 1880

యోహాను సువార్త అపొస్తలుల కార్యములు రోమీయులకు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

1 "పౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి,"

2 ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.

3 "అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి ఒక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను."

4 "అప్పుడతడు నేలమీద పడి - పౌలా, పౌలా నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను."

5 "ప్రభువా, నీవెవడవని అతడుగగా, ఆయన - నేను నీవు హింసించుచున్న యేసును."

6 లేచి పట్టణములోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 9:6 - Saul\'s Conversion
Saul\'s Conversion
7 అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి.

8 పౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక వారతని చెప్పి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.

9 అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను.

10 "దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు - అననీయా అని అతని పిలువగా,"

11 "అతడు - ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు - నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని యింట తార్సువాడైన పౌలు అను వానికొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు."

12 అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తనమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను.

13 "అందుకు అననీయ - ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని."

14 ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను.

15 "అందుకు ప్రభువు - నీవు వెళ్ళుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమైయున్నాడు."

16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

17 "అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, అతని మీద చేతులుంచి పౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టిపొంది పరిశుద్ధాత్మతో నింపబడుటకు నన్ను పంపియున్నాడని చెప్పెను."

18 అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపెను.

19 పిమ్మట అతడు దమస్సులో నున్న శిష్యులతో కూడ కొన్ని దినములుండెను.

20 వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.

21 వినిన వారందరు విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడకు కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.

22 అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి - ఈయనే క్రీస్తు అని ఋజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

23 "అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా, వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చెను."

24 వారు అతనిని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి.

25 గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొనిపోయి గంపలో ఉంచి గోడగుండ అతనిని క్రిందకు దించిరి.

26 అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.

27 అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాటలాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను.

28 "అతడు యెరూషలేములో వారితో కూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు,"

29 "గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచు నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని,"

30 సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోలుకొని వచ్చి తార్సునకు పంపిరి.

31 కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము కట్టబడుచు క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను. మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

32 "ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను."

33 "అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది యేండ్లనుండి మంచముపట్టి యుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,"

34 "పేతురు - ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా,"

35 వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. దొర్కా

36 "మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు యుండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అనగా లేడి అని పేరు. ఆమె సత్క్రియలును, ధర్మకార్యములను బహుగా చేసియుండెను."

37 ఆ దినములయందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి.

38 "లుద్ద యొప్పేకు దగ్గరగా నుండుట చేత పేతురు అక్కడనున్నాడని శిష్యులు విని, అతడు తడవు చేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి."

39 "పేతురు లేచి వారితో కూడ వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరు వచ్చి ఏడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును, వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి."

40 "పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళాని ప్రార్థన చేసి శవమువైపు తిరిగి - తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను."

41 అతడామెకు చెయ్యి నిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను.

42 ఇది యొప్పే యందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.

43 పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహు దినములు నివసించెను.

<< ← Prev Top Next → >>