Bible, లూకా సువార్త, అధ్యాయం 23. is available here: https://www.bible.promo/chapters.php?id=10996&pid=44&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 అంతట వారందరును లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి -

2 "''ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి'' అని ఆయన మీద నేరము మోపసాగిరి."

3 "పిలాతు - ''నీవు యూదుల రాజువా?'' అని ఆయనను అడుగగా, ఆయన - ''నీవన్నట్టే'' అని అతనితో చెప్పెను."

4 పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను - ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను.

5 అయితే వారు - ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

6 "పిలాతు ఈ మాట విని - ఈ మనుష్యుడు గలిలయుడా? అని అడిగి,"

7 ఆయన హేరోదు అధికారము క్రింద నున్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో నుండెను.

8 "హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలము నుండి ఆయనను చూడగోరెను."

9 ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.

10 ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి.

11 "హేరోదు తన సైనికులతో కలసి ఆయనను తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను."

12 అంతకుముందు హేరోదును పిలాతును ఒకని కొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.

13 "అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి,"

14 "ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ యెదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు;"

15 హేరోదునకు గూడ కనబడలేదు. హేరోదు అతనిని తిరిగి మా యొద్దకు పంపెను గదా? కనుక మరణమునకు తగిన దేదియు ఇతడు చేయలేదు.

16 కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా

17 వారందరు - వీనిని చంపివేసి మాకు

18 బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి.

19 వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.

20 "పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట లాడినను,"

21 "వారు - వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి."

22 మూడవమారు అతడు - ఎందుకు ? ఇతడు ఏ దుష్కార్యము చేసెను ? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకగుపలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.

23 "అయితే వారొకే పట్టుదలగా పెద్ద కేకలు వేసి, వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను."

24 "కాగా వారిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పు తీర్చి,"

25 "అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండిన వానిని వారిగినట్టు వారికి విడుదల చేసి, యేసును వారి కిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను."

26 "వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి."

27 "గొప్ప జనసమూహమును, ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి."

28 "యేసు వారివైపు తిరిగి - ''యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి."

లూకా సువార్త 23:28 - Jesus Carries the Cross
Jesus Carries the Cross
29 ఇదిగో గొడ్రండును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.

30 "అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు"

31 వారు పచ్చిమ్రానుకే ఈలాగు చేసిన యెడల ఎండిన దాని కేమిచేయుదురో'' యని చెప్పెను.

32 మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.

33 "వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువ వేసిరి."

34 "యేసు ''తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము'' అని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి."

35 ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును - వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి.

36 "అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి, ఆయనకు చిరకనిచ్చి -"

37 ''నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షింపుకొనుము'' అని ఆయనను అపహసించిరి.

38 ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.

39 "వ్రేలాడ వేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు - నీవు క్రీస్తువు గదా ? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను."

40 అయితే రెండవవాడు వానిని గద్దించి - నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపవా ?

41 మనకైతే ఇది న్యాయమే; మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి

42 "ఆయనను చూచి - ''యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను.''"

43 అందుకాయన వానితో - ''నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను'' అనెను.

44 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను.

45 సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను.

46 "అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి - ''తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను'' అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను."

47 శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.

48 చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి.

49 ఆయనకు నెళవైన వారందరును గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిల్చుండి వీటిని చూచుచుండిరి.

50 అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

51 అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు.

52 "అతడు పిలాతునొద్దకు వెళ్ళి, యేసు దేహము తనకిమ్మని అడుగుకొని,"

53 "దానిని క్రిందికి దించి, సన్నపు నార బట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో నుంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు."

54 ఆ దినము సిద్ధ పరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.

55 "అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి"

56 "తిరిగి వెళ్ళి, సుగంధద్రవ్యములను పరిమళతైలములను సిద్ధపరచి, ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి."

<< ← Prev Top Next → >>