1 విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమిచేయునోయని వారాయనను కనిపెట్టు చుండిరి.
2 అప్పుడు జలోదర రోగము గల యొకడు ఆయన యెదుట నుండెను.
3 యేసు ''విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? కాదా ?''
4 "అని ధర్మ శాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా, వారు ఊరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి, స్వస్థపరచి పంపివేసి,"
5 "''మీలో ఎవని గాడిదయైనను, ఎద్ద్షెనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా?'' అని వారి నడిగెను."
6 ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
7 పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను-
8 "''నిన్నెవరైనను పెళ్ళివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీ కంటె ఘనుడు అతని చేత పిలువబడిన యెడల,"
9 నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు.
10 "అయితే నీవు పిలువ బడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి - స్నేహితుడ, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతో కూడ కూర్చుండు వారి యెదుట నీకు ఘనత కలుగును."
11 తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును'' అని చెప్పెను.
12 "మరియు ఆయన తన్ను పిలిచిన వానితో - ''నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును."
13 అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివారను పిలుపుము.
14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానములో నీవు ప్రత్యుపకారము పొందుదువు'' అని చెప్పెను.
15 "ఆయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా,"
16 ఆయన అతనితో - ''ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.
17 "విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై యున్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను."
18 "అయితే వారందరు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను. అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను."
19 "మరియొకడు నేను ఐదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను."
20 "మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసుకొని యున్నాను, అందుచేత నేను రాలేననెను."
21 "అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడకు తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను."
22 "అంతట దాసుడు- ప్రభువా, నీవాజ్ఞాపించి నట్లు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పెను."
23 అందుకు యజమానుడు నా యిల్లు నిండు నట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతయు చేయుము.
24 ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడు'' అని మీతో చెప్పుచున్నాననెను.
25 బహుజన సమూహములు ఆయనతో కూడ వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి -
26 ''ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమునుసహా ద్వేషింప కుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.
28 మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా ?
29 "చూచు కొనని యెడల అతడు దాని పునాది వేసి ఒకవేళదానిని కొనసాగింప లేకపోయి నందున,"
30 చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింప లేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు.
31 మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు; తన మీదికి ఇరువది వేలమందితో వచ్చువానిని పది వేలమందితో ఎదుర్కొను శక్తి తనకు యున్నదో లేదో ఆలోచించడా?
32 శక్తి లేని యెడల అతడింకను దూరముగా నున్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొనచూచును గదా?
33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.
34 "ఉప్పు మంచిదేకాని, ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?"
35 అది భూమికైనను ఎరువు కైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినును గాక'' అని వారితో చెప్పెను. |