Bible, లూకా సువార్త, అధ్యాయం 12. is available here: https://www.bible.promo/chapters.php?id=10985&pid=44&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 అంతలో వేలకొలది ప్రజలు అక్కడ కూడినప్పుడు త్రొక్కిసలాట మొదలాయెను. ఆయన తన శిష్యులతో ఇట్లని చెప్పసాగెను. - ''పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి.

2 మరుగైనదేదియు బయలుపరచబడక పోదు; రహస్యమైనదేదియు తెలియబడక పోదు.

3 అందుచేత మీరు చీకటిలో మాటలాడు కొనునవి వెలుగులో వినబడును; మీరు గదులయందు చెవులలో చెప్పుకొనునవి మిద్దెల మీద చాటింపబడును''

4 ''నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా - దేహమును చంపిన తరువాత మరేమియు చేయునేరని వానికి భయపడకుడి.

5 ఎవనికి మీరు భయపడ వలెనో మీకు తెలియ జేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.

6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవుని యెదుట మరువబడదు.

7 మీ తలవెంట్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకములైన పిచ్చుకలకంటె శ్రేష్టులుకారా?

8 మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుష్యుల యెదుట ఒప్పుకొనువాడెవడో వానిని మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును.

9 మనుష్యుల ఎదుట నన్ను యెరుగనని చెప్పువానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును.

10 మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు.

11 "వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధికారుల యొద్దకును, అధిపతుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవునప్పుడు, మీరు - ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి"

12 మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును''

13 "ఆ జనసమూహములో ఒకడు - బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచమని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా,"

14 "ఆయన - ''ఓయీ, మీ సహోదరుల మీద తీర్పరిగానైనను పాళ్ళు పంచువానిగా నైనను నన్నెవరు నియమించిరి'' అని వాని నడిగెను."

15 మరియు ఆయన వారితో ''మీరు ఏవిధమైన లోభమునకు చోటియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు'' అనెను.

16 అంతేగాక వారితో ఈ ఉపమానము కూడ చెప్పెను- ''ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.

17 "అప్పుడతడు - నా పంట సమకూర్చు కొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును."

18 "నా కొట్లు విప్పి వాటి కంటె గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్య మంతటిని, నా ఆస్థిని సమకూర్చుకొని"

19 "నా ప్రాణముతో - ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను."

20 "అయితే దేవుడు- వెఱ్ఱివాడ, ఈ రాత్రే నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను."

21 దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును'' అని చెప్పెను.

22 ఆయన తన శిష్యులతో - ''ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియైనను ఏమి ధరించుకొందుమోయని మీ దేహములను గూర్చియైనను చింతింపకుడి.

23 "ఆహారముకంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా ?"

24 "కాకుల సంగతి విచారించి చూడుడి. ఆవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించు చున్నాడు; మీరు పక్షుల కంటె ఎంతో శ్రేష్టులు."

25 మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొన గలడు ?

26 కాబట్టి అన్నిటి కంటె తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కినవాటిని గూర్చి మీరు చింతింపనేల ?

27 "పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి; అవి కష్టపడవు వడుకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక దానివలె నైనా అలంకరింపబడలేదు అని మీతో చెప్పుచున్నాను."

28 ". నేడు పొలములో నుండి రేపు పొయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడులాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసు లారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును."

29 . ఏమి తిందుమో ఏమి త్రాగుదుమోయని విచారింపకుడి. ఆనుమానము కలిగి యుండకుడి.

30 ". ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు, ఇవి మీకు కావలసి యున్నవని మీ తండ్రికి తెలియును,"

31 . మీరైతే మొదట దేవుని రాజ్యమును వెదకుడి. దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

32 ". చిన్నమందా, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి యిష్టమైయున్నది."

33 . మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి; పాతబడని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగ రాడు; చిమ్మెట కొట్టదు;

34 . మీ ధనమెక్కడ నుండునో అక్కడనే మీ హృదయముండును.'' అనెను.

35 "''మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి."

36 తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునోయని అతని కొరకు ఎదురుచూచు మనుష్యులవలె నుండుడి.

37 ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా నుండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

38 మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులైతే మెలకువగా నుండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.

39 దొంగ ఏ ఘడియలో వచ్చునో తెలిసిన యెడల యింటి యజమానుడు మెలకువగా నుండి తన యింటికి కన్నము వెయనివ్వడని తెలిసికొనుడి.

40 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా నుండుడి'' అని చెప్పెను.

41 "అప్పుడు పేతురు - ''ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా?'' అని ఆయననడుగగా,"

42 ప్రభువిట్లనెను- ''తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన యింటి వారి మీద నియమించు నట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు ?

43 ఎవని ప్రభువు వచ్చి వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

44 అతడు తనకు కలిగినదాని యంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.

45 "అయితే ఆ దాసుడు - నా యజమాని వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులనుదాసీలను కొట్టి, తిని, త్రాగి మత్తుగా ఉండసాగితే"

46 "వాడు కనిపెట్టని దినమున, ఎరుగని గడియలో ఆ దాసుని యజమాని వచ్చి వానిని నరికించి అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును."

47 తన యజమానుని చిత్తమెరిగియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.

48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేస్తే వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.''

49 ''నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను.

50 "అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది; అది నెరవేరు వరకు నేనెంతో యిబ్బంది పడుచున్నాను,"

51 నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచు చున్నారా ? కాదు; భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను.

52 "ఇప్పటి నుండి ఒక యింటిలో అయిదుగురు వేరుపడి యిద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు."

53 "తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలుకు, కోడలు అత్తకును విరోధులుగా నుందురు'' అని చెప్పెను."

54 "మరియు ఆయన జనసమూహములతో ఈ విధముగా చెప్పెను; ''మీరు పడమట నుండి మబ్బుపైకి వచ్చుట చూచునప్పుడు, వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, ఆలాగే జరుగును."

55 "దక్షిణపు గాలి విసురుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, ఆలాగే జరుగును."

56 "వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింపనెరుగ నేల?"

57 ఏది న్యాయమో మీయంతట మీరు విమర్శింపరేల?

58 "వాదించువానితో కూడ అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము; లేదా, అతడొక వేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొనిపోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును. అతడు నిన్ను చెరసాలలో వేయును."

59 నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానేరావు'' అని నీతో చెప్పుచున్నాననెను.

<< ← Prev Top Next → >>