Bible, లూకా సువార్త, అధ్యాయం 7. is available here: https://www.bible.promo/chapters.php?id=10980&pid=44&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / లూకా సువార్త

Bible - Telugu Bible OV, 1880

మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

1 ఆయన తాను చెప్పదలచిన మాటలన్నియు ప్రజలకు పూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.

2 ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగముతో బాధపడుచు చనిపోవుటకు సిద్ధముగా నుండెను.

3 శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.

4 వారు యేసునొద్దకు వచ్చి - నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;

5 అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి ఆయనను బహుగా బ్రతిమాలుకొనిరి.

6 "కావున యేసు వారితో కూడ వెళ్ళెను. ఆయన ఆ యింటి దగ్గరకు వచ్చినప్పుడు, శతాధిపతి తన స్నేహితులను చూచి - మీ రాయన యొద్దకు పోయి - ''ప్రభువా, శ్రమపడవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను అర్హుడను కాను,"

7 "అందుచేత నీ యొద్దకు వచ్చుటకు కూడ అర్హుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచపడును."

8 "నేను కూడ ఒకరి అధికారములో ఉన్నవాడిని. నాచేతి క్రిందను సైనికులున్నారు: నేనొకనిని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడి'' అని వారిని పంపెను."

9 యేసు ఈ మాటలు విని అతని గూర్చి బహుగా ఆశ్చర్యపడి తన వెంట నున్న జనసమూహము వైపు తిరిగి- ''ఇశ్రాయేలులోనైనను నేనింత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను'' అనెను.

10 "పంపబడినవారు ఇంటికి తిరిగి వచ్చి, ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి."

11 "తరువాత ఆయన నాయీను అను పట్టణమునకు వెళ్ళుచుండగా, ఆయన శిష్యులును, బహుజనసమూహములును ఆయనను వెంబడించిరి."

12 "ఆయన పట్టణ ముఖ ద్వారము దగ్గరకు వచ్చినప్పుడు, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసికొని పోబడు చుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు; ఆ ఊరి జనులనేకులు ఆమెతో కూడ ఉండిరి."

13 "ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి- ''ఏడువవద్దు'' అని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా దానిని మోయుచున్నవారు ఆగిరి."

14 "ఆయన ''చిన్నవాడ, లెమ్మని నీతో చెప్పుచున్నాను'' అనగా,"

15 . అతడు లేచి కూర్చొని మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లి కప్పగించెను.

లూకా సువార్త 7:15 - Jesus Raises the Widow\'s Son
Jesus Raises the Widow\'s Son
16 "అది చూచిన వారందరు భయభ్రాంతులై - మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి."

17 "ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయు దేశమందంతట, దాని చుట్టూనున్న ప్రాంతములయందంతట వ్యాపించెను."

18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి.

19 అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపించెను.

20 వారాయన యొద్దకు వచ్చి - రాబోవు వాడవు నీవేనా? లేక మరియొకని కొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్ము నీ దగ్గరకు పంపెనని చెప్పిరి.

21 "అదే సమయములో ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలును గల అనేకులను స్వస్థపరచి, గ్రుడ్డివారికి చూపుననుగ్రహించెను."

22 "అప్పుడాయన ఆ వర్తమానము తెచ్చిన వారితో యేసు, ''మీరు వెళ్ళి కన్న వాటిని, విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపునొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్టురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. చనిపోయిన వారు లేపబడుచున్నారు; బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది;"

23 నన్ను విశ్వసించు విషయములో అభ్యంతరపడనివాడు ధన్యుడు'' అని వారితో చెప్పెను.

24 యోహాను దగ్గరనుండి వచ్చిన మనుష్యులు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను: ''మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా?

25 మరేమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొని సుఖంగా జీవనము చేయువారు రాజ మందిరములలో నుందురు.

26 అయితే మరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గానీ ప్రవక్త కన్నా గొప్పవానినని మీతో చెప్పుచున్నాను''-

27 ''ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను'' (మలాకీ3:1) ''అని ఎవరి గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను.

28 స్త్రీలు కనిన వారిలో యోహాను కంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అందరికన్నా అల్పుడు అతనికంటే గొప్పవాడు'' అని మీతో చెప్పుచున్నాను.

29 "ప్రజలందరును, సుంకరులును యోహాను బోధ విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని అంగీకరించిరి గాని,"

30 "పరిసయ్యులును, ధర్మశాస్త్రోపదేశకులును అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి."

31 కాబట్టి ''ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు ఎవరిని పోలియున్నారు?

32 "సంత వీధులలో కూర్చొని యుండి - మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నృత్యము చేయనైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడ్వరైతిరి అని యొకనితో మరియొకడు చెప్పుకొనుచు పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు."

33 "బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకను, ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక అతనికి దయ్యము పట్టినదని మీరనుచున్నారు."

34 "మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక ఇతడు తిండిపోతు త్రాగుబోతుఅనియు, సుంకరులకును పాపులకును స్నేహితుడనియు మీరనుచున్నారు."

35 అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందును'' అనెను.

36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయవలెనని ఆయన నడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి పోయి భోజన పంక్తిలో కూర్చొనినప్పుడు

37 "ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు అక్కడ భోజనమునకు కూర్చుండియున్నాడని తెలిసికొని యొక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి,"

38 "వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదములను త డిపి, తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరును వాటికి పూసెను."

39 ఆయనను పిలిచినపరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తనను ముట్టుకొనుచున్న ఈ స్త్రీ యెటువంటిదో ఎరిగి యుండును; ఇది పాపాత్మురాలని తనలో తాననుకొనెను.

40 "అందుకు యేసు - ''సీమోనూ, నీతో నొక మాట చెప్పవలెనని యున్నాను'' అనగా, అతడు - ''బోధకుడా చెప్పుము'' అనెను."

41 అప్పుడు యేసు అతనితో - ''ఒక అప్పులిచ్చు షావుకారుకు యిద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదు వందల దేనారములును మరి యొకడు యేబది దేనారములును ఋణపడి యుండిరి.

42 "ఆ ఋణమును వారు తిరిగి తీర్చుటకు వారి దగ్గర ఏమియు లేనందువలన అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో యెవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము'' అని యడుగగా,"

43 "సీమోను - అతడెవనికి ఎక్కువగా క్షమించెనో వాడే యని నాకు తోచుచున్నదని చెప్పగా; ఆయన - ''నీవు సరిగా యోచించితివి'' అని అతనితో చెప్పి,"

44 "ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో నిట్లనెను - ''ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తిపి, తన తల వెంట్రుకలతో తుడిచెను."

45 "నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు."

46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని యీమె నా పాదములకు అత్తరు పూసెను

47 "ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి,"

48 నీ పాపములు క్షమింపబడియున్నవి'' అని ఆమెతో అనెను.

49 అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండిన వారు - పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తామనుకొనసాగిరి.

50 "యేసు ఆమెతో ''నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానముగలదానవై వెళ్ళుము'' అని చెప్పెను."
లూకా సువార్త 7:15 - Jesus Raises the Widow\'s Son
Jesus Raises the Widow\'s Son

<< ← Prev Top Next → >>